శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (08:40 IST)

దేశంలో ఆగని పెట్రోల్ - డీజిల్ ధరల బాదుడు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడును ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏమాత్రం ఆపడం లేదు. ఏమాత్రం విరామం ఇవ్వకుండా వీటి ధరలను పెంచేస్తున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ ధర బాదుడు వల్ల ప్రజలతో మోయలేని భారం పడుతున్నప్పటికీ చమురు కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
గత నెల 22వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ బాదుడు ఏకధాటిగా కొనసాగుతోంది. ఆదివారం పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెంచిన చమురు కంపెనీలు సోమవారం పెట్రోల్‌పై మరో 40 పైసలు వడ్డించాయి. దీంతో 14 రోజుల వ్యవధిలో ఇంధర ధరల పెరగడం ఇది 12వ సారి. మొత్తం లీటరు పెట్రోల్‌పై రూ.9.44పైసలు, డిజిల్‌పై రూ.9.10 పైసలు చొప్పున వడ్డించాయి. 
 
తాజాగా పెంచిన ధరతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ ధర రూ.95.07కు చేరుకున్నయి. అలాగే, హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.117.68కి, డిజిల్ ధర రూ.103.75కి చేరుకున్నాయి.