గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:23 IST)

పెట్రో బాదుడు .. 16 రోజుల్లో 14 సార్లు పెరిగిన ఇంధన ధరలు

petrol
దేశంలో ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు మరో 80 పైసల భారాన్ని చమురు సంస్థలు విధించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 105.41గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.67 వద్దకు చేరుకుంది.  తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 
 
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49కు చేరగా.. డీజిల్ ధర రూ. 105.49గా ఉంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటర్ పెట్రోల్, డీజిల్ పై వరుసగా 87, 83 పైసలు మేర పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 121.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 106.87 వద్దకు చేరుకుంది.