దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా ఈ వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కేవలం 795 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే, ఈ వైరస్ నుంచి 1280 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 58 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12054 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,29,839కు చేరింది.
ఇందులో 4,24,96,369 మంది కోలుకున్నారు. మహమ్మారితో 5,21,416 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.17 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.