శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (13:53 IST)

మిసెస్ అండ్ మిస్సెస్ తమిళగం 2022 అడిషన్స్ పూర్తి

ఇండియన్ మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో "మిస్టర్, మిసెస్, మిస్ట్రెస్ తమిళగం 2022 ది గ్రాండ్ చెన్నై" కోసం అడిషన్స్ నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా, ఇండియన్ మీడియా వర్క్స్ వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులోభాగంగా, "మిస్టర్ అండ్ మిసెస్ తమిళగం 2022"ను నిర్వహించనుంది. 
 
ది గ్రాండ్ చెన్నై పేరుతో నిర్వహించిన అడిషన్స్‌లో నటి రాధికా శ్రీనివాస్, ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ తనియా బాలాజీ, మిస్టర్ ఫ్యాషన్ వరల్డ్ ఇండియా 2021 మనికంఠన్‌లు అతిథులుగా పాల్గొన్నారు.
 
ఈ ఆడిషన్స్ కార్యక్రమం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగాయి. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన వినోద్ మిస్టర్ అండ్ మిసెస్ తమిళగం 2022కు కొరియోగ్రఫీ సమకూర్చారు.