శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 23 నవంబరు 2021 (16:59 IST)

ఈ వెడ్డింగ్ సీజన్‌లో రిలయన్స్ జ్యువెల్స్ నుంచి క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ లైన్‌

భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన జువెలరీ బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్, వివాహ వైభవం అందాలను మరింతగా పెంచేందుకు హ్యాండ్‌క్రాఫ్టెడ్, హెరిటేజ్ గోల్డ్ మరియు డైమండ్ ఆభరణాలతో క్లాసిక్ లైన్ డిజైన్‌లను విడుదల చేసింది. ఈ నూతన ఆభరణాల శ్రేణి ప్రారంభంతో, రిలయన్స్ జ్యువెల్స్ నవ వధువులు కాబోతున్న వారి జీవితంలో తరువాత దశ లో సౌభాగ్యం మరియు సంతోషం లభించాలని కోరుతున్నది. ఈ క్యూరేటెడ్ జ్యువెలరీ లైన్ వివాహ వేడుకలకు మాత్రమే కాక, నిశ్చితార్థం, సంగీత్, మెహెందీ, రిసెప్షన్ మరియు అనేక ఇతర వేడుకలకు పెర్ఫక్టుగా సరిపోతుంది.

 
ఈ కలెక్షన్లో విశిష్టమైన బంగారు హ్యాండిక్రాప్ట్ నెక్‌వేర్, లేయర్డ్ స్టైల్ డైమండ్ ఆభరణాలు, అందమైన చోకర్లు, లాంగ్ చైన్‌లు మరియు ఇంట్రికేట్ పనితనంతో హరామ్‌లు మరియు ఎల్లో గోల్డ్ మరియు యాంటిక్ డిజైన్‌లలో క్లాసిక్ బ్రైడల్ పీస్‌లతో సహా బంగారం మరియు డైమండ్‌ ఆభరణాలు  ఉన్నాయి. దీనిలో విశిష్టమైన వారసత్వం, టెంపుల్ శైలి ఆభరణాలు మరియు పురాతన ప్రపంచ అందాల ప్రేరణతో మరియు కొత్త యుగం స్టైల్ డిజైన్ల తో భారతీయ సంస్కృతిని అందంగా రూపొందించే గులాబి మినాకరి పనితనంతో కూడిన ప్రత్యేక బంగారు ఆభరణాల శ్రేణిని కూడా ఉంది.

 
డైమండ్స్‌లో విస్తృత శ్రేణిలో క్లాసిక్ చోకర్‌లు, పసుపు, తెలుపు మరియు గులాబీ బంగారు రంగులలో సొగసైన నెక్‌లెస్ సెట్‌లు మరియు ప్రతి వధువు యొక్క ఆభరణాలు టైమ్‌లెస్ మరియు వెర్సటైల్‌గా ఉండాలనే నవవధువు కోరికను ప్రతిబింబించే అనేక సెట్టింగ్‌లు ఉన్నాయి. వారి జీవితంలో విశిష్టమైన వివాహ వేడుక రోజున, వారి కోసం ఒక అందమైన ప్రకటన చేయుటకు, ఈ విస్తృతమైన కలెక్షన్ డిజైన్ చేయబడింది.

 
ఈ వివాహ ఆభరణాల కలెక్షన్లో భారతదేశం అంతటా విస్తరించిన సంస్కృతి మరియు సంప్రదాయాల సమ్మేళనంతో అనేక డిజైన్‌లు ఉన్నాయి. సాంప్రదాయ, సమకాలీన స్టైల్స్ రెండింటి సమ్మేళనంతో, మరియు విస్తృత శ్రేణి వెయిట్ ఆప్షన్స్‌తో ప్రతి వధువు, ప్రతి కుటుంబానికి తగినది ఏదో ఒకటి దీనిలో ఉంటుంది. వివాహ ఆభరణాల యొక్క కొత్త కలెక్షన్ ను పరిచయం చేయడంతో పాటు, రిలయన్స్ జ్యువెల్స్ ఈ ప్రత్యేక వివాహ ఆఫర్‌ను డిసెంబర్ 23 వరకు కూడా ప్రకటించింది, ఇందులో బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలు మరియు వజ్రాభరణాల విలువపై 20% వరకు తగ్గింపు సౌకర్యం కూడా ఉంటుంది.

 
సునీల్ నాయక్, CEO రిలయన్స్ జ్యువెల్స్ ఈ కలెక్షన్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, “ఈ కలెక్షన్ ద్వారా మేము ప్రతి ఒక్క వధువు యొక్క వైవాహిక జీవితం సంతోషంగా, వైభవంగా కొనసాగాలని కోరుతూ మా శుభాకాంక్షలు అందజేస్తున్నాము. భారతదేశం యొక్క గొప్ప వారసత్వం, కళా రూపాల నుండి ప్రేరణ పొందిన ఈ సాంప్రదాయ మరియు సమకాలీన డిజైన్ల సమ్మేళనంతో, రిలయన్స్ జ్యువెల్స్‌ నుండి మేము ఈ కలెక్షన్ లోని ప్రతి ఒక్క ఆభరణాన్ని చక్కగా హ్యాడిక్రాఫ్ట్ చేసి అందిస్తున్నాం. ప్రతి వధువు జీవితంలోని విశిష్టమైన ఈ వివాహ వేడుక సమయంలో ప్రేమ, వారసత్వం మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, ప్రతి వధువుకు సంతొషం తప్పక అందించాలని మేము అత్యంత శ్రద్ధగా ఈ కలెక్షన్‌ను రూపొందించాము."