హైదరాబాద్‌లో కీర్తిలాల్ ఎక్స్‌క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ విడుదల
నాణ్యత, నమ్మకమే పునాదులుగా తమ వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రీమియం ఫైన్ డైమండ్, గోల్డ్ జ్యువెలరీ బ్రాండ్, కీర్తిలాల్స్ తమ ఎక్స్‌క్లూజివ్ బ్రైడల్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్‌ను హైదరాబాద్‌లోని తమ షోరూమ్‌లో విడుదల చేసింది. నటి సంచితా శెట్టి ఈ కలెక్షన్ ఆవిష్కరించడంతో పాటుగా ప్రదర్శించారు. ప్రత్యేక పండుగ ఆఫర్‌గా అన్ని వజ్రాభరణాలపై కేరట్‌కు 10వేల రూపాయల వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు కీర్తిలాల్స్ ప్రకటించింది.
నవ వధువులకు అత్యంత ప్రాధాన్యతా బ్రైడల్ జ్యువెలరీ బ్రాండ్‌గా మాత్రమే కాదు కాలాతీత సంప్రదాయ మరియు సమకాలీన డిజైన్‌లతో వివాహ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ఆభరణాలను రూపొందించడంలో కీర్తిలాల్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. వినూత్నమైన డిజైన్‌లతో ఈ బ్రైడల్ కలెక్షన్‌ను సున్నితంగా తీర్చిదిద్దారు. ఈకలెక్షన్‌లోని ప్రతి ఆభరణమూ అత్యున్నత నాణ్యత, అతి సున్నితమైన పనితనం ప్రదర్శిస్తాయి.
ఈ కలెక్షన్‌లో నెక్లెస్‌లు, హారములు, గాజులు, చెవి రింగులు మరియు వడ్డాణములలో ప్రత్యేకమైన డిజైన్‌లు ఉన్నాయి. వినియోగదారులు ఎంచుకునేందుకు వీలుగా విస్తృతశ్రేణిలో డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా 80 సంవత్సరాల కీర్తిలాల్స్ యొక్క నాణ్యమైన వజ్రాలను వేడుక చేస్తూ కేరట్‌కు 10 వేల రూపాయల తగ్గింపును పండుగ ఆఫర్‌గా అందిస్తుంది.
తమ వినూత్నమైన ఆభరణాల డిజైన్‌లకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కీర్తిలాల్స్ గెలుచుకుంది. ఇటీవలనే ఈ బ్రాండ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ జ్యువెలరీ అవార్డ్స్ 2021’ను అందుకుంది. ఈ బ్రాండ్‌కు ‘పెరల్ జ్యువెలరీ ఆఫ్ ద ఇయర్’ మరియు ‘రింగ్ ఆఫ్ ద ఇయర్’ విభాగాలలో సైతం అవార్డులు లభించాయి.
ఈ సందర్భంగా శ్రీ సూరజ్ శాంతకుమార్, డైరెక్టర్- బిజినెస్ స్ట్రాటజీ, కీర్తిలాల్స్ మాట్లాడుతూ, ‘‘నూతన బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ ఆవిష్కరించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. వినూత్నమైన డిజైన్‌తో తీర్చిదిద్దబడిన ఈ నూతన శ్రేణి ఆభరణాలను రేపటి వధువుల కోసం అత్యంత అందంగా చేతితో తీర్చిదిద్దబడటం జరిగింది.
వినియోగదారుల నడుమ ఆనందం, సంతృప్తిని ఈ కలెక్షన్ తీసుకురానుంది. వినియోగదారులు కోరుకున్న డిజైన్లను అందించడంలో కీర్తిలాల్స్ ప్రత్యేకతను కలిగి ఉంది. కస్టమైజేషన్ సేవలతో వినియోగదారులు తమ సొంత వ్యక్తిత్వాన్ని తమ ఆభరణాలకు తీసుకురాగలరు. అనుభవజ్ఞులైన స్టోర్ అంతర్గత డిజైనర్లు, వినియోగదారుల సృజనాత్మకతను వెలికి తీయడంలో సహాయపడటంతో పాటుగా అత్యుత్తమ పరిష్కారాలను వారికి అందించడంలోనూ తోడ్పడగలరు’’ అని అన్నారు.