శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (17:35 IST)

సంక్షోభం సానుభూతిని క‌లిగిచిందిః కె.టి.ఆర్‌. - మాన‌వ‌త్వంతో ప్ర‌భుత్వం వుందిః సోనూసూద్‌

KTR- Sonusood andh others
దేశంలో ఏదైనా సంక్షోభం వ‌స్తే వెంట‌నే మ‌న‌లో సానుభూతిని క‌లిగించి అంద‌రికీ స‌హ‌కారాన్ని అందించేలా చేస్తున్న సంస్థ‌ల‌ను మంత్రి కె.టి.ఆర్‌. అభినందించారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతోమంది సేవ‌లు చేసిన వారికి ఆయ‌న సోమ‌వారంనాడు స‌త్క‌రించారు. హైద‌రాబాద్ HICCలో  జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సంస్థల అధినేత‌లు, జయేష్ రంజన్ IAS, ప్రిన్సి పల్ సెక్రట‌రీ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
2020 మరియు 2021లో COVID-19 ద్వా రా పభ్రావితమైన వారికి సహాయం అందించిన వ్యక్తులను, సంస్థలను ఈ కార్యక్రమం ద్వా రా గుర్తించింది తెలంగాణ ప్ర‌భుత్వం. వారిని త‌గు విధంగా స‌త్క‌రించింది.
12 కార్పొ రేట్ సంస్థలు, 26 NGOలు, 29 అసాధారణ వ్యక్తులు, 6 సమన్వయ సంస్థలను స్వయంగా కె.టి.ఆర్‌. సత్కరించారు. దాదాపు 850 పైచిలుకు సంస్థలు వ్యక్తులను ఇ-సర్టిఫికేట్ల (ఎలక్ట్రానిక్) ద్వా రా కూడా సత్కరించారు.
 
అనంత‌రం మంత్రి KT రామారావు మాట్లాడుతూ.. మహమ్మా రి సమయంలో అవిశ్రాంతంగా పనిచేసిన
సంస్థలను మరియు వ్యక్తులను గుర్తించినందుకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (TSIG)ని నేను
అభినందిస్తున్నా ను. ఈ సంక్షోభం మనలో ఉన్న అత్యంత సానుభూతిని కూడా వెల్లడించేలా చేసింది. ఈ కార్యక్రమం ద్వా రా గుర్తించబడిన వారందరికీనా శుభాకాంక్షలు అని తెలిపారు.
 
సోనూ సూద్ మాట్లాడుతూ, "దేశం అదృశ్యంగా వున్న‌ ఘోరమైన శత్రువుతో పోరాడుతున్నప్పుడు, మానవత్వంతో ఈ సైనికులు ముందంజలో ఉన్నా రు, మంచి పోరాటానికి నాయకత్వం వహించి, తమ స్వా ర్థం కంటేఇతరులను సేవ చేయడం ముఖ్యం అని భావించి ముందుకు నడిచారు. ఈ అద్భు తమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తెలంగాణా పభ్రుత్వా నికి,  తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (TSIG) టీ అభినందనలు తెలియజేస్తున్నా అని తెలిపారు.
 
శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ, “మానవత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న‌ సమయంలో, సమాజ శ్రేయ్రే స్సు కోసం తెగువని చూపించిన ఎందరో గొప్ప హీరోలని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పజ్రలు సంఘటిత పయ్ర త్నంతో సమాజంలోని వివిధ వర్గాలకు మద్దతునిస్తూ ఉంటారని మేము ఆశిస్తున్నా ము అన్నారు.
 
2018లో స్థాపించబడిన తెలంగాణ-సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (T-SIG), తెలంగాణ అధికారిక కార్పొ రేట్ సోషల్రె స్పా న్సి బిలిటీ(CSR) వేదిక. T-SIG రాష్టం్రలోని అనేక కార్పొ రేట్ సంస్థలు, NGOలు, పభ్రుత్వ శాఖలు మరియు జిల్లా పరిపాలనలోని అధికారులతో విస్తృతంగా పనిచేస్తుంది.