శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (11:10 IST)

తమిళనాట పెరిగిపోతున్న పెళ్లికాని బ్రాహ్మణ ప్రసాదుల సంఖ్య - వధువుల కోసం వేట!

తమిళనాడు రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. తాజా లెక్కల ప్రకారం తమిళనాడులో 40 వేల మంది బ్రాహ్మణ యువకులు పెళ్ళి కాలేదు. దీనికి కారణం తమిళనాడులో బ్రాహ్మణ యువతులు లేకపోవడమే. దీంతో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వీరికి అమ్మాయిలను చూస్తున్నారు. ఇందుకోసం ఓ బ్రాహ్మణ సంఘం ఏకంగా రంగంలోకి దిగింది. బ్రాహ్మణుల జనాభా అధికంగా ఉండే యూపీ, బీహార్ రాష్ట్రాలకు వెళ్లి వధువుల కోసం వెతుకున్నారు. 
 
ఇదే అంశంపై తమిళనాడు బ్రాహ్మిణ్ అసోసియేషన్ (తమ్ బ్రాస్) అధ్యక్షుడు ఎన్. నారాయణన్ స్పందిస్తూ బ్రాహ్మణ యువకులకు పెళ్లి సంబంధాలు కుదిర్చేందుకు తమ సంఘం తరపున ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను కూడా బ్రాహ్మణ సంఘం మాసపత్రికలో ప్రచురించారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లికాని బ్రాహ్మణ యువకులు 30 నుంచి 40 యేళ్లలోపువారు సుమారుగా 40 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ప్రతి 10 మంది పెళ్లీడు బ్రాహ్మణ యువకులకు కేవలం ఆరు మంది బ్రాహ్మణ అమ్మాయిలు మాత్రమే ఉన్నారన ఆయన వివరించారు.