మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 డిశెంబరు 2021 (22:53 IST)

మూసధోరణులకు కట్టుబడిన ప్రపంచంలో పిల్లలను స్వేచ్ఛగా ఉండనివ్వండి

ఓ బొమ్మల షాపుకెళ్లిఓ బొమ్మ కావాలంటే అడిగే మొదటి ప్రశ్న, అబ్బాయికా, అమ్మాయికా ? అని. లింగ పరంగా మూసధోరణులు ప్రతి చోటా ఉన్నాయి. అమ్మాయిలకు వస్త్రాలంటే పింక్‌, అబ్బాయిలంటే బ్లూ కలర్‌ ఎంత సాధారణమో, సూపర్‌ హీరో డిజైన్స్‌ అబ్బాయిలకు, బ్యాలె డ్యాన్స్‌ క్లాస్‌లు అమ్మాయిలకు కూడా అంతే కామన్‌గా కనబడతాయి. స్త్రీ, పురుషులిరువురూ సమానమేననే కాలంలో ఈ లింగ సమానత్వం పుట్టినప్పటి నుంచే ప్రారంభం కావాలి.

 
ఈ ఆలోచనలతోనే సూపర్‌ బాటమ్స్‌ ఫౌండర్‌ పల్లవి ఇప్పుడు ప్రత్యేక శ్రేణి కిడ్స్‌ అండర్‌వేర్‌ను విడుదల చేసింది. ప్రింట్స్‌, శైలి పరంగా ఎలాంటి మూసధోరణులనూ ఇది ప్రదర్శించదు. సుప్రసిద్ధ బ్రాండ్లు కూడా చిన్నారుల అండర్‌వేర్‌ విభాగంలో ప్రవేశించిన వేళ పల్లవి, ఆమె బృందం ఎలాంటి రాజీపడకుండా ఈ బాటమ్స్‌ రూపొందించారు.

 
ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ, ‘‘మా అబ్బాయికి డైపర్‌ వయసు దాటిన తరువాత అండర్‌వేర్‌ కొనడానికి పడిన ఇబ్బందుల నుంచి ఈ అండర్‌వేర్‌ పుట్టుకువచ్చింది. పెద్దవారి అండర్‌వేర్‌లా పిల్లల అండర్‌వేర్‌లు ఎందుకుండాలి? అండర్‌వేర్‌ అనేది ఎక్కువగా వినియోగించే ఉత్పత్తి. దాదాపుగా 24 గంటలూ వినియోగిస్తుంటారు. దానికి కావాల్సింది సౌకర్యం మాత్రమే. అది దృష్టిలో పెట్టుకునే ఈ అండర్‌వేర్‌ విడుదల చేశాం’’ అని అన్నారు.

 
ఆమెనే మాట్లాడుతూ, ‘‘సూపర్‌బాటమ్స్‌ అండర్‌వేర్‌లు అత్యంత మృదువుగా ఉండటంతో పాటుగా మోడాల్‌, కాటన్‌ల సమ్మేళనంగా ఉంటుంది. భారతదేశంలో సర్టిఫైడ్‌ బీచ్‌ఉడ్‌ మోడాల్‌తో రూపుదిద్దుకున్న మొట్టమొదటి అండర్‌వేర్‌ ఇది.  కాటన్‌తో పోలిస్తే మూడు రెట్లు మృదువుగా ఇది ఉంటుంది. నాలుగు సంవత్సరాల వయసు వరకూ సూపర్‌బాటమ్స్‌ అండర్‌వేర్‌లు యునిసెక్స్‌గా ఉంటాయి. పూర్తి సురక్షితమైన రంగులనూ వీటిలో వాడాము’’ అని అన్నారు.