శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (18:55 IST)

పెళ్లికూతురిగా ముస్తాబైంది.. పరీక్షా కేంద్రానికి వచ్చింది.. పరీక్ష రాసింది..

Bride
అమ్మాయికి పెళ్లి కుదిరింది. అదే రోజు పరీక్ష కూడా వుంది. అంతే పెళ్లికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాసింది. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఎగ్జామ్ రాసిన వధువుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిన శివంగి అనే యువతి పెళ్లికూతురిగా ముస్తాబైంది. పెళ్లి దుస్తులు ధరించి పరీక్ష హాలుకు రాగానే పరీక్ష రాసే తోటి అభ్యర్థులు షాకయ్యారు. 
 
అయితే వివాహం రోజే పరీక్ష ఉండటంతో ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆమె పరీక్ష రాయగలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో కాస్త తెగ వైరల్‌ అవుతోంది. 
 
తమకు పెళ్లి కంటే చదువు ముఖ్యమని శివంగి బగ్తారియా చెప్పారు. ఇప్పటికే ఈ వీడియోను ఐదు లక్షలకు పైగా మంది వీక్షించారు. అయితే శివాంగి ఇలా పెళ్లి కంటే పరీక్షలపై దృష్టి పెట్టడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారింది. చాలామంది శివాంగిని మెచ్చుకున్నారు.