1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (12:05 IST)

మానేరు డ్యాంలో యువతి మృతదేహం.. ఏం జరిగింది..?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. రోజు రోజుకీ మహిళపై దాడులు, అత్యాచారాలు, హత్యలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా మానేరు డ్యాంలో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఓ గుర్తు తెలియ‌ని యువ‌తి శవం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో ల‌భ్య‌మైంది. 
 
యువతి మృతి పై పలు అనుమానాలున్నాయ‌ని స్థానికులు అంటున్నారు. ఆ యువతిపై దాడి జరిగిందా లేకుంటే అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అంతేగాకుండా ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా ? లేక ఆమెను ఎవరైనా హత్య చేసి లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.