వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రో ధరలు
దేశంలోని వాహనదారులకు స్వల్పంగా ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం చమురు కంపెనీలు పెంచలేదు. గడిచిన రెండు వారాలుగా పెంచుతూ వచ్చిన ఇంధన ధరలకు గురువారం కాస్త బ్రేక్ ఇచ్చింది.
ఫలితంగా గురువారం ఇంధన ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ గుంటూరులో మాత్రం పెట్రోల్ ధర ఏకంగా భారీగానే ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ రూ.121.44గా వుంది.
ఇకపోతే, ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.120.51గాను, డీజిల్ ధర రూ.104.77గాను, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.110.85గాను, డీజిల్ ధర రూ.100.94గా వుంది. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గాను, డీజిల్ ధర రూ.105.49గా వుంది.