1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:02 IST)

దేశంలో భారీగా పెరిగిన సీఎన్జీ ధరలు - కిలోకు రూ.2.50 పైసలు

cng gas
దేశలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన వాణిజ్య వంట గ్యాస్ సిలిండరు ధరపై ఏకంగా రూ.250 వరకు పెంచిన విషయం తెల్సిందే. ఇక పెట్రోల్, డీజిల్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు సీఎన్జీ ధరలు వరుసగా పెరిగాయి. ఈ ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. 
 
గురువారం ఢిల్లీలో సీఎన్జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో సీఎన్జీ ధర కిలో రూ.69.11కు చేరింది. గత రెండు రోజుల్లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ ధరలను కిలోకు రూ.5 పెంచింది. ఇది ఏప్రిల్‌లో మూడోసారి పెంచినట్టయింది. కాగా, ఈ నెల మొత్తంలో కిలో రూ.9.10కి పెరిగింది.