బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:55 IST)

కొవ్వొత్తులు - విసనకర్రలు పంచిపెట్టిన నారా లోకేష్

nara lokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది. ఈ బాదుడు దెబ్బకు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ వైకాపా పాలకులు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. పైగా, ఇపుడు విద్యుత్ చార్జీలు పెంచడానికి గత చంద్రబాబు ఐదేళ్ల పాలనే కారణమంటూ సరికొత్త వింత వాదనను తెరపైకి తెచ్చారు. 
 
పైగా, గత మూడేళ్లుకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందనీ, గత తెదేపా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈ పాలన సాగుతోందంటూ కితాబిస్తున్నారు. మరోవైపు, పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. 
 
ఇందులోభాగంగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు ఆయన కొవ్వొప్తుతులు, అగ్గిపెట్టెలు, విసనకర్రలను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగారు.