బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (17:29 IST)

జగన్‌పై ఫైర్ అయిన నారా లోకేష్... వైసిపి దండుపాళ్యం గ్యాంగ్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకుడు చేతిలో మహిళ దారుణ హత్యకు గురైందని, మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్న భద్రత ఇదేనా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. 
 
చిత్తూరుకు చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో చోటుచేసుకున్న వివాదంతో వైసిపి నేత ఎన్ వెంకట్ రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసిపి దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట అని నారా లోకేష్ మండిపడ్డారు. 
 
రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు. ఇకపోతే.. ఇటీవల జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలపై అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ సర్కార్‌ను నారా లోకేష్ దారుణంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.