1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:02 IST)

ఏపీ ప్రజలకు షాక్.. ఆర్టీసీ టిక్కెట్ రేట్ల పెంపు

apsrtc bus
తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ ఆర్టీసీ ప్రయాణీకులపై భారం పడింది.  ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్ విధించారు. డీజిల్ రేట్లు పెరగడంతో బస్సు ఛార్జీలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందని ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమల వెల్లడించారు.
 
ఏపీ ఆర్టీసీ కొత్త రేట్ల ప్రకారం.. పల్లె వెలుగు బస్సుకు రూ. 2, ఎక్స్ ప్రెస్ బస్‌పై రూ. 5, ఏసీ బస్సుకు రూ. 10 పెంచుతున్నట్టు ప్రకటించారు.

పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో కనీస ఛార్జీలు రూ. 10కు పెంచారు. పెరిగిన డీజిల్ సెస్ ధరలు గురువారం (ఏప్రిల్ 14) నుంచి అమల్లోకి రానున్నాయి.