కెజిఎఫ్ నిర్మాణ సంస్థతో సుధ కొంగర చిత్రం
తెలుగులో వెంకటేష్‌తో `గురు` అనే సినిమాకు దర్శకత్వం వహించిన సుధ కొంగర తమిళసినిమాలు మూడు చేసింది. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ చేయబోతోంది. కన్నడరంగంలో ప్రవేశించబోతోంది. కె.జి.ఎఫ్. సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిలింస్ ఆమెతో క్రేజీ ప్రాజెక్ట్‌ను చేయనున్నట్లు ప్రకటించింది.
కొన్ని కథలు చెప్పడానికి అర్హవంతంగా వున్రిటాయి. అవే సరిగ్గా చెప్పబడతాయి. అంటూ కొటేషన్‌తో కన్నడ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలింస్ ప్రకటన విడుదలచేసింది. యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నదని త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని ప్రకటించింది. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఈమెతో సురేష్‌బాబు గురు చిత్రం తర్వాత మరో సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. కానీ ఎందుకనో ఆలస్యమైంది. ఆ తర్వాత ఈమె దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్నాడనే వార్త కూడా వినిపించింది.
సుధ కొంగర స్క్రీన్ రైటర్, తమిళ సినిమాల్లో ప్రధానంగా పనిచేసిం. మణిరత్నం దగ్గర ఏడేళ్ళపాటు దర్శకత్వ శాఖలో పనిచేసింది. 49 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఆంగ్ల చలన చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయ ఆంగ్ల చిత్రం మితర్, మై ఫ్రెండ్ చిత్రాలకు ఆమె స్క్రీన్ రైటర్‌గా పనిచేశారు.