ఎఫ్3 సెకండ్ సింగిల్ ఏప్రిల్ 22న విడుదల
F3 new poster
ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్‌లో ప్రధాన తారాగణం రోప్ పుల్లింగ్ ఆట ఆడుతూ కనిపించారు. ఒక వైపు, తమన్నా, మెహ్రీన్ సోనాల్ చౌహాన్ తాడును లాగుతుండగా మరోవైపు వరుణ్ తేజ్ ఒంటరిగా కష్టపడటం, వెంకటేష్ తన మార్క్ స్టయిల్‌లో వరుణ్‌ని ప్రోత్సహించడం ఆకట్టుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కూల్‌గా కనిపిస్తుండగా, తమన్నా, మెహ్రీన్, సోనాల్ గ్లామర్‌గా కనిపిస్తున్నారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో సందడి చేయనుంది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.
ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.
