శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (19:33 IST)

పాట కోసం కోటి డిమాండ్ చేసిన జిగేల్ రాణి (video)

Pooja Hegde
Pooja Hegde
హీరోయిన్లు ఇప్పుడు ఐటం గాళ్‌గా మారిపోతున్నారు. ఒక‌ప్పుడు వాటికి ప్ర‌త్యేక‌మైన న‌టీమ‌ణులు వుండేవారు. కానీ ప‌రిస్థితుల‌రీత్యా వేంప్ పాత్ర‌లు చేసేవారు క‌నుమ‌రుగ‌యి హీరోయిన్లే చేయ‌డం ఆన‌వాయితీ వ‌స్తోంది. ఇటీవ‌లే పుష్ప సినిమాలో స‌మంత‌, గ‌ని సినిమాలో త‌మ‌న్నాలు ఐటెంసాంగ్‌లు చేసి కోట్ల రూపాయ‌లు పారితోషికంగా పుచ్చుకున్నారు. సినిమా అంతా వుండి అందులో క‌ష్ట‌ప‌డి న‌టించడంకంటే ఇదే బెట‌ర్ అని భావిస్తున్నారు.
 
తాజాగా న‌టి పూజా హెగ్డే ఐటం సాంగ్ చేయ‌బోతోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఎఫ్‌3లో ఈమె ప్ర‌త్యేక పాట‌లో న‌ర్తించ‌నుంది. ఇంత‌కుముందు రంగ‌స్థ‌లంలో జిగేల్‌రాణిగా అల‌రించింది.

ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఆమెను సంప్ర‌దించ‌డం అందుకు సుమారు కోటి పారితోసికం అగ‌డం నిర్మాత‌లు అంగీక‌రించ‌డం జ‌రిగిపోయాయ‌ని యూనిట్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించిన వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు.