ఆ ఇద్దరితో నా కెమిస్ట్రీ బాగుంటుంది- పూజా హెగ్డే
ప్రభాస్‌తో పూజా హెగ్డే చేసిన సినిమా `రాధేశ్యామ్`. ఈ సినిమా విడుదలకు ముందు ప్రభాస్‌తో విభేదాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాటిని కొట్టిపారేసింది. ఇటీవలే బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన `సర్కస్` చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ప్రభాస్‌తో తనకూ ఎటువంటి విభేదాలు లేవు. ప్రభాస్ మంచి వ్యక్తి. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌తో కెమిస్ట్రీ బాగుంది. చూసినవారంతా అదే అన్నారు. ఆ సినిమా నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మళ్ళీ ఛాన్స్ వస్తే బాహుబలి3లో చేయాలనుంది. అందులో నాయికగా నేనే చేస్తా. రాధేశ్యామ్‌లో నేను కళ్ళతో పలికిన సన్నివేశాలకు మంచి ప్రశంసలు దక్కాయి అని చెప్పింది.
అలాగే సర్కస్ సినిమా గురించి చెబుతూ, ఇది పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. రణ్‌వీర్ సింగ్ హీరో. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ అవుతుంది. నేను రణవీర్‌ను ఆంటీ అని పిలుస్తాను. పమ్మీ ఆంటీ అని పేరు పెట్టాను. ఎందుకంటే సెట్లో ఎప్పుడూ సరదాగా వుంటాడు అని చెప్పింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ విదేశాల్లో జరుగుతోంది. సో. ఇద్దరు హీరోలతో కెమిస్ట్రీ బాగుందని చెప్పిన హారోయిన్ పూజా హెగ్డే అన్నమాట.