1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (17:14 IST)

ప్రభాస్‌కు స్పెయిన్‌లో శస్త్రచికిత్స

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్‌కు స్పెయిన్‌లో ఓ ఆపరేషన్ జరిగింది. అయితే, ఈ ఆపరేషన్ పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ, 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం "సాహో". ఈ  చిత్రం షూటింగ్ సమయంలో ఆయన గాయపడ్డారు. ఈ గాయం మళ్లీ తిరగదోడటంతో ఆయన స్పెయిన్‌కు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నట్టు సమాచారం. 
 
ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు. అలాగే, ప్రభాస్‌ చేయించుకున్న ఆపరేషన్ గురించి ఆరా తీస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ప్రభాస్ నటించిన తాజా చిత్రం "రాధేశ్యామ్". ఈ పీరియాడిక్ ప్రేమ కథా చిత్రం ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. మిశ్రమ టాక్ తెచ్చుకున్న రాధేశ్యామ్‌లో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటించగా, రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు.