శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (09:39 IST)

ఉగాది కానుకగా ఓటిటీలోకి రాధే శ్యామ్

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్‌. ఈ నెల 11న థియేటర్లలో విడుదలైంది. త్వరలోనే ఓటిటీలోకి విడుదల కానుంది.
 
ఓటిటీ అమెజాన్‌ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 2న ఉగాది కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌ కావొచ్చని భావిస్తున్నారు.
 
ఇకపోతే.. ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మార్చి 11న విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 
 
యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ-ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో విడుదలైంది. 
 
అయితే.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లో 119 కోట్లు వసూలు చేసిన రాధేశ్యామ్.. మూడు రోజుల్లో 151 కోట్లు రాబట్టింది.