సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (14:27 IST)

బాహుబలి రాజ్యం చుట్టూ ఏదో జరుగుతోందిగా? బాహుబ‌లి 3 గురించి రాజమౌళి ప్ర‌క‌ట‌న‌

SS Rajamouli
ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టిస్తున్నారు. తాజాగా సోష‌ల్‌మీడియా ఆధ్వ‌ర్యంలో ఓ ఛాన‌ల్‌కు ఆయ‌న ఇంట‌ర్వ్యూ ఇస్తే, ఆయ‌నకు ప్ర‌ధానంగా బాహుబ‌లి గురించి ఆస‌క్త‌కిర‌మైన ప్ర‌శ్న‌లు ఎదురయ్యాయి.

 
బహుబలి విడుద‌ల‌య్యాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు చేసి ఎన్నో ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా దర్శకుడు రాజమౌళి బహుబలి 1,2 చిత్రాల ద్వారా టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. మగధీర, ఈగ, బహుబలి 1,2 తో రాజ‌మౌళి తన మార్క్ చూపెట్టాడు. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడానికి జక్కన్న రెడీ అయ్యాడు. 

 
కాగా, ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్‌లో ఉన్న ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర కామెంట్ చేశాడు. ఇప్పటికే చాలా మంది దర్శకుడు రాజమౌళిని బహుబలి 3పై ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి చెక్ పెడుతూ ఆయన బహుబలి3 పై క్లారిటీ ఇచ్చాడు. ఓ యాంకర్ బహుబలి 3 గురించి ప్రశ్నించగా.. రాజమౌళి దానికి స్పందిస్తూ.. బహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను చూపించనున్నాం. దీనిపై వర్క్ చేస్తున్నాం.బాహుబలి-3పై నిర్మాత శోభు కూడా సుముఖంగా ఉన్నారని అన్నారు. దీన్ని తీయడానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ బాహుబలి నుంచి ఆసక్తికర వార్త రానుందని ఆయన తెలిపారు. దీంతో జక్కన్న బహుబలి 3పై క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్ప‌టికే ఆర్.ఆర్‌.ఆర్‌. విడుద‌ల తేదీ ఇచ్చేశారు.