శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (14:10 IST)

టాలీవుడ్ వైపు చూస్తోన్న ఎం.టి.వీ మోడ‌ల్ యుక్తి

YUKTI THAREJA
ప్ర‌ముఖ మోడ‌ల్ యుక్తి  (యుక్తి తెర్జా) న‌టిగా మారాల‌నుకుంటోంది. మోడ‌ల్‌గా సుప‌రిచితులు. ఎం.టివి. సూప‌ర్ మోడ‌ల్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా అవార్డు పొందిన హ‌ర్యానా భామ‌కు ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తోంది. తాజాగా ఆమె ప‌లు భంగిమ‌ల‌తో ఫోజ్‌లిస్తూ పోస్ట్ చేసింది. హాట్‌గా వున్న ఆమె ఫొటోలు ప‌లువురు దృష్టిని ఆక‌ర్షించింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప్ర‌ముఖ‌హీరోతో న‌టించేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది.
 
YUKTI THAREJA
ఇప్ప‌టికే ఆ హీరో చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. డాన్స‌ర్‌గానూ ప్రావీణ్యం వున్న ఆమె గ్లామ‌ర్ రోల్ వేయ‌డానికి సిద్ధ‌మ‌ని తెలియ‌జేస్తోంది. త‌న గ్లామ‌ర్‌కు త‌గిన‌విధంగా సౌంద‌ర్యాన్ని కాపాడుకుంటాన‌ని చెబుతూనే నాన్ వేజ్ అంటే ఇష్టంగా తింటాన‌ని పేర్కొంటోంది. త్వ‌ర‌లో ఈమె గురించి మ‌ర‌న్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.