ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (17:51 IST)

హర్యానాలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

హర్యానాలో  కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని బివానీ జిల్లాలోని తోషమ్ ప్రాంతంలో దాడమ్ మైనింగ్ జోన్ ఈ ఘోరం జరిగింది. శిథిలాల కింద దాదాపు 20 మంది గల్లంతైనట్లు సమాచారం. 
 
దాడమ్‌ మైనింగ్‌ జోన్‌లో క్వారీ పనులు చేస్తుండగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అక్కడున్న వాహనాలు కూడా మట్టిలో కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.