ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (13:33 IST)

హర్యానాలో ఢీకొన్న రెండు బస్సులు - ఐదుగురు మృత్యువాత

హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. హర్యా నుంచి ఢిల్లీ వైపు వెళుతున్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు అమిత వేగంతో వచ్చి ఢీకొట్టింది. 
 
దీంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.