శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (14:04 IST)

హర్యానాలో ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే...

హర్యానా రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో ఉన్న ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకై కేటాయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సుప్రీంకోర్టు సమ్మతం తెలిపింది. గతంలో ఇదే అంశంపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు తొలగించింది. అలాగే, ఈ కేసు విచారణను నాలుగు వారాల్లో ముగించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆదేశించింది. 
 
తమ రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే దక్కాలని ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు పరిశ్రమలు పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. 
 
హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీంతో ఈ స్టేను సుప్రీంకోర్టు తాజాగా ఎత్తివేసింది. అయితే, కొత్త చట్టం అమలు చేయని ప్రైవేటు కంపెనీలపై బలవంతపు చర్యలకు దిగొద్దని హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది.