శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (13:44 IST)

నిరాడంబ‌రంగా నయనతార పెండ్లి అయిందా!

Nayantara, Vignesh Sivan
నయనతార, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివన్ వివాహం చేసుకోబోతున్నార‌నేది సినీప్రియుల‌కు తెలిసిందే. గ‌త అక్టోబర్ నుంచి వీరిద్ద‌రూ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. చేయిచేయి ప‌ట్టుకుని దేవుని ద‌ర్శ‌నం చేసుకుని ప‌ట్టువ‌స్గ్రాలు స‌మ‌ర్పిస్తున్నారు. ఇదిలా వుండ‌గా, తాజాగా సోమ‌వారంనాడు ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా పేజీలో ఓ ఫొటోను పంచుకున్నారు. వివ‌రాలు ఏమీ చెప్ప‌కుండా దేవాల‌య‌ల చుట్టూ తిరుగుతున్న‌ట్లు పేర్కొన్నాడు. దీంతో ఇంత‌వ‌ర‌కు ప‌లు దేవాల‌యాల‌ను ప్ర‌ద‌క్ష‌ణ చేసిన ఆయ‌న ఈసారి ప్ర‌త్యేకంగా పోస్ట్ చేస్తే లాంఛ‌నంగా పెండ్లి అయిపోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

తాజగా విఘ్నేష్ శివన్ నయనతార చెన్నైలోని కాలికాంబల్ ఆలయానికి వెళ్ళిన‌ట్లు తెలుస్తోంది. అక్కడ వారిద్దరు కలిసిదిగి ఫొటోలో నయన్ నుదుట సింధూరం పెట్టుకొని కనిపించింది. అయితే పెళ్లైన స్త్రీలు మాత్రమే నదుట సింధూరం పెట్టుకుంటారు. దీంతో వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నయన్ శివన్‌లు ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.
 
ఇప్ప‌టికే  ముంబాదేవి మహా లక్ష్మి ఆలయం, సిద్ధి వినాయకుడుతోపాటు ప‌లు ఆల‌యాల‌ను తిరిగి వ‌చ్చారు. విశ్వ‌స‌నీయ‌స‌మాచారం ప్ర‌కారం కుజ‌దోషానికి సంబంధించిన పూజ‌లు చేయించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలోనూ ఐశ్వ‌ర్య‌రాయ్ కూడా పెండ్లికి ముందు ఇలాంటి పూజ‌లు నిర్వ‌హించింది. మ‌రి న‌య‌న‌తార పెండ్లి ఈ ఏడాదిలో అవనున్న‌ట్లు తెలుస్తోంది. నిరాడంబ‌ర‌కంగా చేసుకుంటారా, ఆడంబ‌రంగా వివాహం చేసుకుంటార‌నేది త్వ‌ర‌లో తెలియ‌నుంది.