శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (12:26 IST)

ప్రత్యేక పాట కోసం ఎఫ్ 3సెట్స్‌లో ఎవరు చేరారో తెలుసా!

Pooja Hegde
Pooja Hegde
 ప్రత్యేక పాట కోసం ఎఫ్ 3సెట్స్‌లో ఎవరు చేరారో తెలుసా! అంటూ చిత్ర యూనిట్ ఇలా స్టిల్‌ను విడుద‌ల చేసింది. హీరోల‌కు త‌గిన‌ట్లుగా వెనుక భాగం చూపిస్తూ ప్ర‌క‌ట‌న‌లో ఆస‌క్తిని క‌లిగించారు. ఇంత‌కీ ఆమె ఎవ‌రోకాదు. పూజా హెగ్డే. ఆమె ఓ ప్ర‌త్యేక గీతంలో చేయ‌నున్న‌ట్లు పాఠ‌కుల‌కు తెలిసిందే. కోటి రూపాల ఢిమాండ్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. పూజ కెరీర్ గ్రాఫ్‌ను చూసి పాన్ ఇండియా మూవీ అంటే మాత్రం పూజాహెగ్డే వైపే చూస్తున్నారు అగ్ర దర్శకనిర్మాతలు, హీరోలంతా.
 
నాయిక‌గా మంచి ఫామ్‌లో వున్నా స‌రే ఐటెంసాంగ్ కోసం ముందుకు వ‌చ్చింది. ఒక‌ర‌కంగా ఆమె ఓ హీరోయిన్‌గా చేయాల్సివుంది. డేట్స్ కుద‌ర‌క ఇలా చేయాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది.  ఇప్పటికే రంగస్థలంలో “జిగేలు రాణి”గా ఉర్రూతలూగించిన బుట్టబొమ్మ, వేస‌విలో కుర్ర‌కారుని అల‌రించ‌డానికి ఇలా స‌మాయ‌త్త‌మైంది.  వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన‌ ‘ఎఫ్3’ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  మే27 ఎఫ్3 విడుద‌ల‌కాబోతోంది.