గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (13:48 IST)

"ఎఫ్-3"లో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్‌

Pooja Hegde
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం "ఎఫ్-3". ఇందులో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఐటమ్ సాంగ్ చేయనున్నారు. గతంలో రాంచరణ్ హీరోగా - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన "రంగస్థలం" చిత్రంలో 'జిగేల్ రాణి'గా అభిమానులను మెప్పించారు. ఇపుడు 'ఎఫ్-3'లో మరోమారు ఐటమ్ సాంగ్‌లో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. 
 
నిజానికి వరుస చిత్రాలతో బిజీగా ఉండే హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లలో నటించేందుకు సాహసం చేయరు. కానీ, పూజా హెగ్డే మాత్రం స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు సమ్మతించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో పూజా హెగ్డే స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో కూడా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. కాగా, ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు ఆలరించనున్నారు.