సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (16:31 IST)

చిక్కుల్లో పడిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్

bhagavan mann singh
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చిక్కుల్లో పడ్డారు. మ‌ద్యం మ‌త్తులో భ‌గ‌వంత్ మాన్ గురుద్వారాలోకి ప్ర‌వేశించార‌ని, ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని బీజేపీకి ఫిర్యాదు అందింది. 
 
బీజేపీ చెందిన యువనేత తేజింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గా నేరుగా పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ మేర‌కు భ‌గ‌వంత్ మాన్‌పై తాను పోలీసుల‌కు చేసిన ఫిర్యాదు ప్ర‌తుల‌ను బ‌గ్గా సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.
 
ఈ నెల 14న వైశాఖి సంద‌ర్భంగా తాగిన మత్తు ఇంకా దిగ‌కుండానే గురుద్వారాలోకి ప్ర‌వేశించారంటూ శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ (ఎస్జీపీసీ) భ‌గ‌వంత్ మాన్‌పై శుక్ర‌వారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఇంకా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.