మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేడు పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ సింగ్ ప్రమాణం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని అందుకుంది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో ఆ ఒక్క పార్టీనే ఏకంగా 92 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆప్ ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
అయితే, ఈ ప్రమాణ స్వీకారానికి ఓ ప్రత్యేక ఉంది. ఇతర పార్టీల నేతల మాదిరిగాకాకుండా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖత్కర్ కలాన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో అక్కడ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేశారు. 
 
ఆడంబరాలకు అల్లంత దూరంగా ఉండే ఆప్ పార్టీగా ఆప్ జనాల్లోకి వెళ్లగా అందుకు విరుద్ధంగా ఇతర పార్టీ నేతలు చేసే భారీ ఏర్పాట్ల తరహాలోనే ఇక్కడ ఏర్పాట్లు చేయడం ఇపుడు విమర్శలకు దారితీసింది. ఈ ఏర్పాట్లను చూసిన తర్వాత ఆప్ కన్వీనర్ ఏమంటారో వేచిచూడాల్సింది.