శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (17:16 IST)

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

Kalvakuntla kavita
తెరాస నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కవితతో పాటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎన్నికైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. 
 
ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కవిత, దామోదర రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిద్దరికీ మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు.
 
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితతో ప్రొటెం చైర్మన్ అమిన్ ఉల్ హసన్ జాఫ్రీ ప్రమాణ స్వీకారం చేయించారు. తను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కవిత కృతజ్ఞతలు చెప్పారు.