సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (11:55 IST)

తెలంగాణాలో గండ్ర దంపతులకు పాజిటివ్ - అధికారుల్లో టెన్షన్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. ఈ వైరస్ అనేక మంది రాజకీయ ప్రముఖులకు సోకుతుంది. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ కాటేస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన భార్య, జడ్జీ ఛైర్మన్ గండ్ర జ్యోతికి కరోనా వైరస్ సోకింది. దీంతో వారిద్దరూ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. 
 
అదేసమయంలో వారితో కాంటాక్ట్ అయిన మంత్రులు, అధికారులకు ఇపుడు టెన్షన్ మొదలైంది. తాజాగా జిల్లాలో పంట నష్టంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇతర నేతలతో కలిసి వీరిద్దరూ పర్యటించారు. మంత్రులతో కలిసి పరకాల నుంచి నర్సంపేట వరకు హెలికాఫ్టరులో వెళ్లారు. 
 
ఈ క్రమంలో మంగళవారం వారిద్దరికి చలిజ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయగా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. తమతో సన్నిహితంగా ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వీరు ప్రస్తుతం తెరాసలో కొనసాగుతున్నారు.