ఎఫ్3 సెకండ్ సింగిల్ ప్రోమో వైరల్
F 3 new poster
తాజాగా 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. కలర్ఫుల్ అండ్ గ్లామరస్ గా డిజైన్ చేసిన ఈ ప్రోమో క్షణాల్లో వైరల్ గా మారింది. విడుదల చేసిన కొద్దిసేపటికే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ..ఈ ప్రోమోలో జోష్ ఫుల్ మాసీ డ్యాన్సులతో సందడి చేస్తూ కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట కోసం మరో చార్ట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతుంది. ప్రోమో చివర్లో సునీల్ తన ట్రేడ్ మార్క్ స్టెప్ తో కనిపించడం పాటపై ఇంకా ఆసక్తిని పెంచింది. ఏప్రిల్ 22న పూర్తి పాటని చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది.
తర్వాతి కథనం
