గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (20:31 IST)

మా ఇష్టం విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్ - రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Maa istam release poster
Maa istam release poster
ఇద్ద‌రు అమ్మాయిల ప్రేమ‌క‌థ‌తో రాం గోపాల్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మా ఇష్టం చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు నోచుకుంది. సినిమా విడుద‌ల‌కు ఎగ్జిబిట‌ర్లు, పంపిణీదారులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతోపాటు పంపిణీదారుడు నట్టి కుమార్ త‌న‌కు వ‌ర్మ డ‌బ్బులు బాకీ ఉన్నాడంటూ కోర్టులో కేసు వేయ‌డంతో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అడ్డంకుల‌న్నీ క్లియ‌ర్ అయ్యాయ‌ని వ‌ర్మ తెలియ‌జేశారు. 
 
వ‌ర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ 8 ,2022న మూడు బాషల్లో రిలీజ్‌కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి,నట్టి  కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు
                           
నేను ఇప్పుడు నట్టి క్రాంతి నట్టి కరుణ ల మీద ఫోర్జరీ కి సంభందించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నా పై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి,నట్టి కరుణ ల ఫాదర్  అయినటువంటి నట్టి కుమార్  మీద  నేను , తుమ్మలపల్లి రామత్యనారాయణ గారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు forged డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమా ని ఆపి మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు కూడా నేను, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు వాళ్ల మీద damage కేసు వెయ్యబోతున్నాము                  
 
ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్‌ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని May 6 న విడుదల చెయ్య బోతున్నాము. దానికి సంభందించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్‌లు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము
 
ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణ లు  చేసిన  క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజక్షన్-ఆర్డర్‌ను నట్టిలు సేకరించిన విధానాన్ని ,  యంత్రాంగాన్ని  దుర్వినియోగ పరుచుకున్న తీరు నట్టి ఫ్యామిలీ యొక్క  నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది అని అన్నారు.