గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 26 మే 2022 (23:56 IST)

మామిడికాయలతో అందానికి మెరుగులు, ఎలాగో తెలుసా?

mangoes
సీజనల్‌గా వచ్చే పండ్లతో అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. పచ్చిమామిడికాయ పేస్ట్ లేదా బాగా పండిన మామిడి పండ్ల గుజ్జులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి, 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది. అవసరం అయితే అందులో కొద్దిగా బాదం ఆయిల్ కూడా మిక్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

 
బాగా పండిన మామిడిపండ్ల గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా క్లే లేదా ఓట్స్, తేనె, పాలు వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 
రోజూ ఓ గ్లాసు టమోటా జ్యూస్‌తో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. టమోటాలు రక్తప్రసరణను పెంచుతాయి. టమోటోల్లో ఉండే విటమిన్ సి చర్మం సౌందర్యానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే టమోటోల్లా బెర్రీస్‌ కూడా చర్మ సౌందర్యానికి ఎంతగానో తోడ్పడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.