1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 25 జులై 2022 (23:56 IST)

పాలు కలిపిన టీ అధికంగా తాగితే అనారోగ్యమా?

సహజంగా బ్లాక్ టీలో పాలు జోడించడం అనేది సాధారణ పద్ధతి. టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. పోషకాహార లాభాలను పెంచుకోవడానికి పాలు లేకుండా టీ తాగాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

 
పాలను ఇలా టీలో కలపకుండా పాలు, టీని విడివిడిగా తాగవచ్చు. ఈ రెండింటినీ కలపడం వల్ల కొన్ని జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. టీ శక్తిని చాలా వరకు నిరోధిస్తుంది.

 
ముఖ్యంగా రోజంతా నాలుగైదు కప్పుల పాల టీ తాగడం వల్ల వికారం, కడుపు ఉబ్బరం అనిపించవచ్చు. నాలుకపై పూత పూసినట్లు అనిపిస్తుంది. నోటి నుంచి వెలువడే శ్వాస దుర్వాసన వస్తుంది. టీలోని కెఫిన్ అశాంతిని కలిగిస్తుంది. నిద్ర చక్రానికి ఆటంకం కలిగిస్తుంది. దీని వలన అలసిపోతారు. అందువల్ల సాధ్యమైనంత మేర టీ తాగటాన్ని పరిమితంగా చేసుకోవడం ఉత్తమం.