బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (23:29 IST)

జాజికాయతో.. అందం ప్లస్ ఆరోగ్యం.. (video)

Nutmeg
Nutmeg
జాజికాయతో అందంతో పాటు ఆరోగ్యాన్నిస్తుంది. జాజికాయ ఊరగాయల రూపంలో లేదా చూర్ణంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి తీసుకుంటే సంతానలేమిని తొలగిస్తుంది. నరాల బలహీనతకు ఇది చెక్ పెడుతుంది. 
 
అలాగే జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్లు వున్న ప్రాంతాల్లో జాజికాయ నూరి పూతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తామర వంటి చర్మ వ్యాధులు దూరమవుతాయి. 
 
ఎండకు కమిలిపోయిన చర్మానికి జాజికాయ పొడిని, తేనెలో కలిపి ట్యాన్ అయిన ప్రదేశంలో రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే, కొన్నాళ్లకు ట్యాన్ మొత్తం పోతుంది. 
 
చికెన్ ఫాక్స్ ఉన్నవారికి జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడులను ఆహారానికి ముందు పావు స్పూన్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.