రాధతో శ్రియ.. ఫోటోలు వైరల్
2001లో వచ్చిన ఇష్టంతో మొదలైన శ్రియ సినీ జర్నీ సక్సెస్ ఫుల్‌గా సాగింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రియ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే 2018లో రోమ్‌కు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను వివాహం చేసుకుందీ శ్రియ. ఆ తర్వాత ఎక్కువగా రోమ్‌లో గడుపుతూ వస్తోంది.
ఇక 2020లో శ్రియ ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కొన్ని రోజుల పాటు చాలా సీక్రెట్‌గా ఉంచిన ఈ బ్యూటీ ఓ రోజు అభిమానులతో పంచుకుంది.
తన కూతురు పేరు 'రాధ' అని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక శ్రియ తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌లో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా తన కూతురు రాధతో కలిసి చేసిన సందడికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది శ్రియ.