ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (22:18 IST)

కూతురిపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి... పిండాన్ని అమ్మేస్తోంది..

కూతురిపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి కన్నకూతురు పిండాన్ని కన్నతల్లి అమ్ముకుంటున్న ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మైనర్ బాలిక నుంచి లెక్కకు మించిన సార్లు పిండం విక్రయించిన ముఠాను అరెస్ట్ చేయగా, తల్లి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తల్లి, పెంపుడు తండ్రి సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 
 
ఈరోడ్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక వయస్సును 22 ఏళ్లుగా ఆధార్ కార్డులో మార్పు చేసి బాలిక పిండాన్ని చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. తనకు 14 ఏళ్లు ఉన్నప్పటి నుంచి పిండాన్ని ఇస్తున్నట్లు బాలిక వాంగ్మూలం ఇచ్చింది. 
 
ఒక్కో పిండాన్ని రూ.25వేల నుంచి రూ.49వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలిక పిండాన్ని తమిళనాడులో మాత్రమే కాకుండా తిరువనంతపురానికి చెందిన ప్రైవేట్ ఆస్పత్రికి, ఏపీలో తిరుపతిలో వున్న ఓ ఆస్పత్రికి ముఠా విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.