శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:02 IST)

నోరా ఫతేహికి బిఎండబ్ల్యు కారు, జాక్వెలిన్‌కు రూ. 10 కోట్లు: విచారణలో ఆర్థిక నేరగాడు సుకేష్

Nora Fatehi
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగులకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర రూ. 200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

 
jacqueline fernandez
ఆ 200 కోట్లు ఏం చేసాడన్న దానిపై ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం సుకేశ్‌ను ప్రశ్నించింది. ఈ దర్యాప్తులో అతడు పలువురు ప్రముఖుల పేర్లు చెప్పినట్లు తెలిసింది. వారితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కూడా ఇతడికి సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించింది. దీనితో నోరా ఫతేహిని పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణలో డిసెంబరు 12, 2020 వరకూ సుకేశ్ ఎవరో తనకు తెలియదని నోరా వెల్లడించింది. ఐతే ఈ నటికి తను బీఎండబ్ల్యు కారు బహుమతిగా ఇచ్చినట్లు సుకేశ్ పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. కానీ కారును తిరిగి అతడికి ఇచ్చేసినట్లు నోరా విచారణలో తెలియజేసింది.

 
మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి రూ 10 కోట్ల విలువైన బహుమతులు సుకేశ్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనితో ఆమెకి కూడా నోటీసులు పంపారు.