సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (11:26 IST)

నటి యామీ గౌతమ్ ఇన్‌స్టా ఖాతా హ్యాక్

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సైబర్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించారు. తన ఇన్‌స్టా ఖాతాను హ్యాండిల్ చేయలేకపోతున్నానని, బహుశా హ్యాకర్లు హ్యాక్ చేసివుంటారని పేర్కొంది. అందువల్ల ఇన్‌స్టా ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం జరిగే జాగ్రత్తగా ఉండాలని కోరింది.
 
"హాయ్.. నేను నిన్నటి నుంచి నా ఇన్‌స్టా ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండచ్చునని మీకు తెలియజేస్తున్నాను. మేము వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపాలు ఉంటే దయచేసి గమనించగలరు. ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. కాగా, యామీ గౌతమ్ ఖాతాను 15.1 మిలియన్ల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.