మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (18:27 IST)

సమంత వద్దన్నా.. ఆమెను ఫాలో అవుతున్న చైతూ..

టాలీవుడ్ హీరో నాగచైతన్య, టాలీవుడ్ హీరోయిన్ సమంతల ప్రేమ వివాహం.. విడాకులతో పెటాకులైన సంగతి తెలిసిందే. ఏ మాయ చేసావేతో మొదలై మజిలీతో ముగిసింది.
 
ఇక విడిపోయాక ట్విట్టర్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం మానేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చైతూని సామ్ అన్‌ఫాలో చేసింది. కానీ ఆమెను మాత్రం చైతూ ఫాలో అవుతున్నాడు. అయితే అక్కినేని ఫ్యామిలీని, దగ్గుబాటి ఫ్యామిలీని ఆమె ఫాలో అవుతుంది. కానీ చైతూని అన్‌ఫాలో చేసింది.
 
ఇక సామ్ సినిమాల విషయానికి వచ్చేసరికి గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీని కంప్లీట్ చేసిన ఆమె.. ప్రస్తుతం యశోద షూటింగ్‌లో బిజీగా ఉంది. అటు విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య.