బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (11:53 IST)

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రోసారి స‌మంత

Samatha-Vijay
మ‌హాన‌టి సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి స‌మంత న‌టించింది. ఇప్పుడు మ‌రోసారి  వారిద్ద‌రి క‌ల‌యిక రాబోతుంది. ఇప్ప‌టికి అందించిన స‌మాచారం మేర‌కు విజయ్ దేవరకొండ మిల‌ట్రీ అధికారి పాత్ర‌ను ఓ సినిమాలో చేయ‌నున్నాడు. ఈనికి శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇటీలే వెల్ల‌డించారు. అందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని అడిగారు. త‌ను బిజీగా వున్నాన‌ని చేయ‌డానికి స‌మ‌యంలేద‌ని చెప్పింది. ఇప్పుడు ఆప్లేస్‌లో స‌మంత రాబోతుంద‌ని సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. 
 
ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందనగానే ఆసక్తి మొదలైంది. ముందుగా దిల్‌రాజు సినిమా చేయాల్సింవుంది. కానీ పూరీ జ‌గ‌న్నాథ్‌తో వున్న క‌మిట్‌మెంట్‌తో లైగ‌ర్ చేశాడు. ఆ త‌ర్వాత ముంబైవెళ్ళి విజ‌య్‌కు శివ క‌థ చెప్పాడ‌ని అది బాగా న‌చ్చింద‌ని తెలిసింది.  త్వ‌ర‌లోనే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో  దిల్ రాజు ప్రొడక్షన్స్  సినిమా గురించి ప్ర‌క‌టించ‌నుంది. ఈ చిత్ర క‌శ్మీర్ నేప‌థ్యంలో వుంటుంద‌ని తెలుస్తోంది.  
 
కాగా, విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత వెంటనే పూరీ కాంబినేష‌న్‌లో `జనగణమన’ మూవీలో నటించబోతున్న‌ట్లుగా కూడా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. మ‌రి ఏ సినిమా ముందు మొద‌లువుతుంద‌నేది తెలియాల్సివుంది.