ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (13:06 IST)

బ్లాక్ డ్రెస్‌లో యువ‌తుల్ని ఆక‌ట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda, Puri Jagannadh, Charmi Kaur
విజయ్ దేవరకొండ బాలీవుడ్ మూవీ లైగ‌ర్‌. అన్ని భాష‌ల్లోనూ అది రూపొందుతోంది. ఎందుకంటే ముంబైలో ఎక్కువ‌గా షూటింగ్ జ‌రుగుతోంది.  డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మి కౌర్ నిన్న రాత్రి  బ్లాక్ అండ్ బ్లాక్ డెస్‌లో బ‌ర్త్‌డే వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలు ముంబైలో జరిగాయి. క‌రోనా జోహార్‌తోపాలు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక లైగ‌ర్ టీమ్ కూడా అక్క‌డే వుండ‌డంతో వారుకూడా ఇలా బ్లాక్ కోడ్ డ్రెస్‌తో పాల్గొన్నారు.
 
Vijay Devarakonda, Puri Jagannadh, Charmi Kaur, Karan Johar,
పుట్టిన‌రోజు వేడుక‌లో విజయ్ దేవరకొండ హైలైట్ అయ్యాడు. యువ‌తుల‌తోపాటు మ‌హిళ‌లుకూడా విజ‌య్‌తో ఫొటోలు దిగ‌డానికి ఆస‌క్తిక‌న‌బ‌రిచారు. ఈ విష‌యాన్ని చార్మి తెలియ‌జేస్తూ, ఫొటోలు పెట్టింది. ఎంతో కాలంగా క‌ష్ట‌ప‌డుతూ హీరోలుగా చేస్తున్న అంద‌రికంటే త‌క్కువ కాలంలో విజయ్ దేవరకొండ పాన్  ఇండియా స్టార్ కావ‌డం విశేషంగా బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు రాస్తోంది. త్వ‌ర‌లో ప్ర‌ముఖ మేగ‌జైన్‌లో క‌వ‌ర్‌పేజీలో ఆయ‌న రాబోతున్నాడు. ఇప్ప‌టికే ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో ముందులో వున్న విజయ్ దేవరకొండ తాజాగా థ‌మ్ స‌ప్ యాడ్‌ను కొత్త‌గా చేశాడు. 
 
ఇక లైగ‌ర్ సినిమా ముప్పావుభాగం పూర్త‌యింది పూరీ తెలియ‌జేస్తున్నాడు. ఇందులో మైక్ టైస‌న్ న‌టించ‌డం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అందుకే ఈ సినిమాను ప‌లు విదేశీ భాష‌ల్లో కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు.