ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (23:07 IST)

యంగ్ హీరోతో ప్రేమ.. సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

నాగచైతన్యతో విడిపోయాక హీరోయిన్ సమంత కెరీర్‌ పరంగా బాగా బిజీ అయిపోయింది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్ చేస్తోంది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా చేస్తూ బిజీ అవుతోంది. 
 
ప్రస్తుతం కోలీవుడ్‌లో హీరో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. అంతేగాకుండా హాలీవుడ్ నుండి కూడా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల ఫోటో షూట్‌లో కూడా సమంత పాల్గొన్నట్లు.. ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 
 
ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ యంగ్ హీరోతో ప్రేమ కథ నేపథ్యం కలిగిన సినిమా చేయటానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 
 
శివ నిర్వాణ, పూరి జగన్నాథ్ సినిమా కాకుండా ఇది మరో కొత్త ప్రాజెక్టు అని.. ఇందులో ముగ్గురు హీరోయిన్లు వుంటారని అందులో ఒక హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మహానటి సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన సంగతి తెలిసిందే.