1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (16:10 IST)

సూర్య `ఇ టీ` తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ

Suriya, Sathyaraj, Saranya Ponvannan
బహుముఖ నటుడు సూర్య తాజా యాక్షన్ థ్రిల్లర్ 'ET.  పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10, 2022న ఒకేసారి విడుదల కానుంది.
 
ఇటీవ‌లే హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ET టీజర్‌ను విడుదల చేశారు. నేడు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు పంపారు. `ఇ.టి. తెలుగు ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించినందుకు చాలా ఆనందంగా వుంది. రాక్ సాలిడ్‌గా లుక్ కనిపిస్తోంది. నాకు ఇష్టమైన హీరో సూర్య‌కు `ఎవ‌రికి త‌ల‌వంచ‌డు`చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నానని విజ‌య్ పోస్ట్ చేశాడు.
 
ఇతరుల ఆనందంలో ఆనందాన్ని చూడాలనుకునే సామాజిక పోరాట యోధుడిగా సూర్య నటించారు. అతని గాల్ ఫ్రెండ్ గా ప్రియాంక అరుల్ మోహన్  బబ్లీ లాంటి పాత్ర పోషించింది. సామ‌ర‌స్యంగా వున్న ఓ గ్రామాన్ని ఒక నేరస్థుడు అతని ముఠా గ్రామంలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడంతో గ్రామంలో సామరస్యం దెబ్బతింటుంది. సామరస్యాన్ని తిరిగి తీసుకురావడానికి కథానాయకుడు  ఎటువంటి చ‌ర్య తీసుకున్నాడ‌నేది కథ  ప్రధాన ఇతివృత్తంగా రూపొందింది.
 
సూర్య ఇంటెన్సివ్‌, ప‌వర్-ప్యాక్డ్ పాత్రను పోషించాడు. అతను కొన్ని సమయాల్లో ఫన్నీగా ఉంటాడు. అలాగే ప్రజలను రక్షించే విషయంలో దూకుడుగా ఉంటాడు. ప్రియాంక అరుల్ మోహన్ చాలా అందంగా కనిపించగా వినయ్ రాయ్ విలన్‌గా నటించాడు.
 
పాండిరాజ్ తన రచన, దర్శకత్వం కోసం బ‌ర్నింగ్ ఇష్యూను ఎంచుకున్నాడు.  డి ఇమ్మాన్ అందించిన నేపథ్య సంగీతం అన్ని అంశాల‌ను ఎలివేషన్‌లను చేస్తుండ‌గా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ లో ఆక‌ట్టుకుంటుంది.
 
సత్యరాజ్, రాజ్‌కిరణ్, శరణ్య పొన్‌వణ్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.