శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (12:09 IST)

కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్ చిత్రం విక్రమ్ షూటింగ్ ముగిసింది

Vikram latest
యూనివర్సల్ హీరో కమల్ హాసన్,  స‌క్సెస్‌ఫుల్‌ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి చిత్రం `విక్రమ్` థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. వేసవిలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్లు నేడు దర్శకుడు లోకేష్ తెలియజేశారు.
 
`ప‌ది రోజుల షూటింగ్ తర్వాత చిత్ర యూనిట్ ఇచ్చిన స‌పోర్ట్‌తో పూర్తిచేశామ‌నీ ఇందుకు మొత్తం నటీనటులు, సిబ్బందికి ధన్యవాదాలు  అని లోకేష్  ట్వీట్ చేశాడు. ఇందుకు క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి, ఫహద్ ఫాసిల్, అనిరుద్ద్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.
 
షూటింగ్ చివరి రోజు సంద‌ర్భంగా దర్శకుడు ఓ వీడియోను కూడా విడుద‌ల చేశాడు. `ఫహద్ ఫాసిల్ షార్ట్ గన్ తో గన్ పేల్చాడు. దీంతో షూట్‌ ముగిసిందని లోకేష్ సింబాలిక్‌గా తెలియజేసినప్పుడు, ఫహద్ “పార్టీ లేదా పుష్పా?” అని అడిగాడు. (ఇది పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్)
 
కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా విడుద‌లైన‌`విక్రమ్` ఫస్ట్ గ్లాన్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.
 
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
లోకేష్ కనగరాజ్ `విక్రమ్` కోసం కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి ముగ్గురు ప‌వ‌ర్‌ఫుల్‌పెర్ఫార్మర్లను ఒకచోట చేర్చగలిగారు.
 
స్టార్ కాస్ట్‌తో పాటు, ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
 
విక్రమ్ చిత్రం సాంకేతిక బృందంలో కంపోజర్ అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు.
 
తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ మరియు ఇతరులు
 
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: లోకేష్ కనగరాజ్
నిర్మాతలు: కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్
బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్