ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (18:55 IST)

భీంలా నాయక్ డే అంటూ సంబ‌రాలు

Trivikram cake cutting
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లానాయక్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన నేప‌థ్యంలో చిత్ర యూనిట్ సంబ‌రాలు జ‌రుపుకుంది. శుక్ర‌వారం సాయంత్రం చిత్ర నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ త‌న స‌భ్యుల‌తో సితార ఎంట‌ర్‌టైన్ మెంట్ కార్యాల‌యంలో జ‌రుపుకున్నారు.
 
ఈ రోజు భీమ్లానాయక్ డే అంటూ ద‌ర్శ‌కుడు త్రి విక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌క‌టిస్తూ, చిత్ర యూనిట్‌ను హుసారెత్తించారు. రీమేక్ అయినా మ‌న నేటివిటీకి అనుగుణంగా క‌థ‌ను మార్చుకుని తీశాం. లాక్‌డౌన్‌లో థియేట‌ర్ల ఇబ్బంది ప‌డుతుంద‌ని వాయిదా వేశాం. ఎట్ట‌కేల‌కు సినిమా విడుద‌ల‌చేశాక అభిమానులు, ప్రేక్ష‌కుల‌నుంచి మంచి స్పంద‌న రావ‌డం ఆనందంగా వుంద‌ని నిర్మాత తెలియ‌జేశారు.
 
Bhemla day tapasulu
కాగా, రేపు అన‌గా ఫిబ్ర‌వరి 26వ తేదీన హైటెక్ సిటీలోని ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌లో స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. మ‌రి ఈ వేడుక‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తాడో లేదో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా రావ‌చ్చ‌ని తెలుస్తోంది.